B-BOOK MAKING SERVICES FOR THE EVENT OF YOUR "GENEALOGICAL TREE"- SOFT SERVICES A-Z The secret of success-YOUR FAMILY TREE OR మీ వంశ వృక్షం: B-BOOK MAKING SERVICES FOR THE EVENT OF YOUR "GENEALOGICAL TREE"- SOFT SERVICES A-Z The secret of success పర్సనల్ సర్వీసెస్-వంశ వృక్షం
SOFT SERVICES A-Z
The secret of success
GENEALOGICAL TREE
వంశ వృక్షం: ఫ్యామిలీ ట్రీ:
వంశ వృక్షం: ఫ్యామిలీ ట్రీ:
1 "కుటుంబం" అన్న మాటకు అర్ధం మనకు తెలుసు, అలాగే
కుటుంబానికున్న ముఖ్యలక్షణాలు కూడా మనకు తెలుసు, వ్యక్తుల
మధ్యన వివాహ సంబంధంతో, ఒకే నివాసంలో కలిసి జీవించడం,
శారీరికంగా, సామాజికంగా కలిసిఉంటూ పిల్లలను కనడం, వంశాన్ని వృద్ధి
చేయడం, కుటుంబంలోని సభ్యుల మద్య ఆప్యాయతలు, అనుబంధాలు, అనుభవాలు, అనుభూతులు రక్తసంబంధాలతో ముడిపడి ఉంటాయి, పిల్లలకు
సమాజంలో ఒక మంచిస్థానాన్ని కల్పించడం, మన సంస్కృతిని
సాంప్రదాయాలను వారికి అందజేయడం, కుటుంబవ్యవస్థ ముఖ్యోద్దేశాలుగా చెప్పుకోవచ్చు,
తమవంశాన్ని అభివృద్ధిచేసుకోవడం కుటుంబలక్ష్యం. అలా వృద్ధి చెందుతూ చెందుతూ, వంశం,
ఒక మర్రి వృక్షం లాగా, ఊడలమర్రి వృక్షాలమర్రియై, ఎన్నో ఎకరాల స్థలంలో క్రమ క్రమంగా
విస్తరిస్తున్నట్లు, దిన దిన ప్రవర్థమానమై వర్ధిల్లుతూ, వంశంలో జన్మించిన వారికే
కాకుండా, వివిధ బంధాలతో వంశవృక్షంతో సంబంధంఉన్న ఎందరికో, కష్ట కాలంలో, ఆపద
సమయాల్లో చేయూతనిచ్చేదిగా, ఒక చల్లని ఛాయనిచ్చేదిగా నిలుస్తుంది ఒక వంశవృక్షం,
2 నిన్నమొన్నటివరకు మనదేశంలో, ఉమ్మడి కుటుంబాలు సిరిసంపదలతో తులతూగాయనడానికి,
మనమే ప్రత్యక్షసాక్షులం, భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు,
నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబవ్యవస్థ, నాగరికత విస్తరణకు పూర్వమే, మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ
ఉందని, వివిధ గ్రంథాలలో వివరించబడినది, నాగరిక ప్రపంచంలోనూ, మన దేశంలో ఉమ్మడి
కుటుంబవ్యవస్థ, మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది, ఒక కుటుంబంలో తాత మొదలు,
వారి పిల్లలు, వారి పిల్లలు, ఇలా మూడు నుంచి నాలుగు తరాలు, ఉమ్మడి అనే గొడుగుకింద
ఒదిగిపోయేవి, ఇంటిలోని పెద్దకు అందరూ గౌరవం ఇచ్చేవారు, కుటుంబానికి సంబంధించిన
అన్ని విషయాల్లోనూ, ఆయన మాటే అంతిమ నిర్ణయంగా ఉండేది,
3 అందరిదీ ఉమ్మడి వ్యవసాయమే. సమష్టి సంపదనే, సమష్టి భోజనాలే ఉండేవంటే, సంతోషం కలుగుతుంది, తల్లిదండ్రులు, అత్తమామలు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు,
బావామరదళ్లు, బందుమిత్రులు, తాతలు, బామ్మలు, మనుమలు,
మనమరాండ్లతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు, సిరిసంపదల నిలయాలు, ఆ
కుటుంబాలలో లేమి అనే పదానికి తావుండేదికాదు, కష్టసుఖాలను సమానంగా పంచుకునే
ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో, ఒంటరితనానికి
చోటుండేదికాదు,
4 క్రమక్రమంగా మనుషుల మధ్య అనుబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి,
అనురాగాలు, ఆప్యాయతలు ఆవిరై పోతున్నాయి, విదేశీ పాలకుల పాలనలో ఉమ్మడి కుటుంబాలుగా
చెలామణి అయిన ఎన్నో కుటుంబాలు, నవనాగరిక ప్రపంచంలో విచ్ఛిన్నమయ్యాయి, ఆధునికత
పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, ఉమ్మడికుటుంబ వ్యవస్థమీద
తీవ్రప్రభావాన్ని చూపింది, ఈ నాగరిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా, రెండు
మనసులుకూడా కలసి జీవించలేని పరిస్థితి నెలకొంది, డబ్బు సంపాదన కోసం, కనీసం భార్యాభర్తలు కూడా ఒక చోట కూర్చొని,
ఒకరినొకరు పలకరించుకునే సమయం దొరకడం లేదంటే, మన కుటుంబాలు ఎంతగా విచ్ఛిన్నమయ్యాయో
అర్థంచేసుకోవచ్చు,
5 ఉమ్మడి కుటుంబాలలో కలిసిమెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపించి,
పెళ్ళయిన మర్నాడే వేరు కాపురాలు పెట్టుకుని, జంటలుగా ఉండవలసినవాళ్ళు వివిధ
కారణాలతో ఒంటరై పోతున్నారు, దీంతో సలహాలిచ్చే పెద్దదిక్కులు లేకపోవడం, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు దూరంకావడం, కనీసం మనసులోని
బాధలను పంచుకునే బంధువులుకూడా కరువవ్వడం, నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే
దృశ్యం, దీనికి కారణం, ఒక ఉమ్మడి కుటుంబం నుంచి, ఎన్నో కుటుంబాలుగా విడిపోతున్న కుటుంబ
సభ్యులు, అమ్మ, నాన్న, ఒక అన్న,
ఒక చెల్లె, ఇది చిన్న కుటుంబం, చిన్న కుటుంబమైనా, పెద్దకుటుంబమైనా, కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే, అందరూ సంతోషంగా
ఉంటారు, పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు, వారు
పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే, ఎవరి కుటుంబాలు వారివే, అంటే ఒక కుటుంబం నుంచి,
మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి, ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ,
వంశవృక్షపు వేర్లుమాత్రం, మొదటి కుటుంబంవద్దే ఉంటాయి, కలసి ఉంటే కలదు సుఖము
అన్నారుకద, అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాలని, సరదాగా గడపాలని
కోరుకోవడం సహజం,
6 ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, ఒకరినొకరు పలుకరించుకునే సమయం దొరకని
కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, మొబైల్ ఫోన్‌లలో యోగక్షేమాలు కనుక్కునే కుటుంబాలు చాలాఉన్నయి,
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మనదేశం పుట్టినిల్లు, ఇప్పుడు ఆ సంస్కృతి కనిపించడం
లేదంటే కారణం, అనేక కుటుంబాలు వ్యక్తిగత కారణాలతో విచ్ఛిన్నంకావడం, మనం రోజూ
చూస్తూఉన్నదే, అయినప్పటికీ మనదేశంలో, అనేకకుటుంబాల మధ్య కనిపించే అన్యోన్యతా భావం,
మరే దేశంలోనూ కనిపించదు, విడిపోతున్న కుటుంబసభ్యులమధ్య, తిరిగి సఖ్యత
పెంపొందించాలనే ఉద్దేశంతో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, పంతొమ్మిదివందల తొంబైరెండులో
మే
పదిహేనున అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం, జరుపుకోవడానికి నిశ్చయించింది, కుటుంబ విషయంలో నైతిక, సామాజిక సూత్రాలు రూపొందించి, కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి,
ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో,
సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామాజిక విలువలను, పరస్పరం పంచుకుంటూ,
కుటుంబ సమస్యల విషయంలో, సరైన సమాచారాన్ని, సహకారాన్ని
అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి, ఆయా
కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం, వంటి లక్ష్యాలతో మే పదిహేనున, అంతర్జాతీయ
కుటుంబ దినోత్సవం రోజును జరుపుకుంటున్నాము, అలాఎన్నో ఉన్నతమైన లక్షణాలున్న, మన ఉమ్మడికుటుంబ
వ్యవస్థ విచ్ఛిన్నంకాకుండా, కాపాడుకోవలసిన అవసరం ఉంది, మళ్లీ ఉమ్మడి కుటుంబాలను, ప్రోత్సహించవలసిన అవసరం ఎంతోఉంది.
ఆ దిశగా ఈ రోజు అందరం మనస్ఫూర్తిగా ప్రతినపునాలి.
7 కులాలు, మతాలు, వర్గాలు, ఎన్ని ఉన్నప్పటికీ, మన దేశం లోని ప్రజలందరూ, ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. అందుకే మనదేశాన్ని, ఉదారచరితగల వసుదైకకుటుంబం అన్నారు. అలాంటిది మన ఇంటిలోని వారు కలసిమెలసి జీవించలేరా? ఆ రోజు మళ్లీ రావాలంటే, మీ వంశంలోని పెద్దవాళ్లకు తెలిసినంతవరకు, మీ వంశం గురించి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, మీ వంశం పేరు, కులం పేరు, గోత్రం పేరు, వంశంయొక్క మూలపురుషుడు, మూలస్త్రీ వివరాలు, ఆ తరువాత వంశంలోని పెద్దలు, ముత్తాతలు, ముత్తాతమ్మల పేర్లు, మీ పూర్వీకుల అప్పటి నివాసస్థలం, ప్రస్తుతం మీనివాసస్థలం, గ్రామం, తాలూకా, జిల్లా. మీ వంశంలోని ఈ మధ్య కాలంలోని పెద్దలు, తాతలు, పెద్దతాతలు, చిన్నతాతలు,తాతమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, అత్తలు, మామలు, అన్నలు,తమ్ముళ్లు, వదినలు, మరదళ్లు, అక్కలు, చెల్లెళ్లు, పెద్దబావలు, చిన్నబావలు, కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్లు, అమ్మ, నాన్న, మరియు మీరు. మొదలైన వారందరి ఫొటోలు, వీడియోలు, వాళ్ళ పేర్లు, రూపురేఖలు, గుణగనాలు, వాళ్ళ వృత్తి, నివాసము, ఇలా నాటి తరం నుండి నేటి తరం వరకు, మీవద్ద అందుబాటు లో ఉన్న వివరాలన్నింటిని పొందుపరచి, మీ కుటుంబ సభ్యులమధ్యనున్న సంబంధ బాంధవ్యాలను వివరిస్తూ, శాకోప శాఖలుగా విస్తరించిన మీ వంశవృక్షాన్ని, మీరు పంపిన ఫోటోలు విడియోలతో సందర్భానికి తగిన పదజాలంతో, మనోహరంగా, ఎంతో గొప్పగా, "ఈ-బుక్" చదివేవారి మనసును ఆకట్టుకునే లాగా ఉంటుంది, ఈ మల్టీ మీడియా ఈ-బుక్స్ ని మీరు చదవడం మాత్రమే కాదు, వినాలనుకుంటే వినొచ్చు. మీరిచ్చిన అన్ని వివరాల ఆధారంగా, మీరు కోరిన అన్ని విషయాలు పొందుపరచి, మీ వంశ వృక్షం "ఈ-బుక్" సాఫ్ట్ కాపీ, లేదా డిజిటల్ కాపీ, తయారుచేసి ఇస్తాము, మీ వంశ వృక్షం "ఈ-బుక్" వలన, మీ సోషల్ రిలేషన్స్ పెరుగుతాయి, మీ వంశంలోని వారితో, ఎప్పుడో మరుగున పడిపోయిన, మీ పాత బంధుత్వాలు మెరుగు పడతాయి, దానివల్ల పలుకుబడి పెరుగుతుంది, మీరు సామాజికంగా బలపడతారు, మీ వంశంలోని వారందరికీ, సమాజంలో జీవించడం సరళతరమవుతుంది, అప్పుడే వసుదైకకుటుంబం అనే పదానికి నిజమైన సార్థకత చేకూరుతుంది. మీ వంశ వృక్షం "ఈ-బుక్" తయారు చేయడం కోసం, మీరు తీసుకున్న ఫొటోలు, వీడియోలు మొదలైన వాటికి, తగిన ఆడియో విజువల్ డిస్క్రిప్షన్, నెరేషన్, యానిమేషన్, డిజైనింగ్, టెక్స్ట్, ఇమేజ్స్ తో, అద్భుతమైన మల్టీమీడియా పర్సనల్ “ఈ-బుక్స్”, మీరు కోరిన విధంగా తయారు చేసి ఇవ్వబడతాయి. ఇంకా మీకు, మీ జీవిత చరిత్ర, మీ పెళ్లి పుస్తకం లాంటి మరేవిధమైన “ఈ-బుక్స్” కావాలన్నాకూడా, తయారుచేసి ఇస్తాము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలొ, మీరు కోరిన భాషలో రాసి ఇవ్వబడతాయి, మీకు గ్రాంథిక భాషలో గానీ, లేదా వ్యావహారిక భాషలో గానీ, తెలంగాణా ప్రాంత మాండలికాల్లో గానీ, లేదా ఆంధ్ర ప్రాంత భాషల్లో గానీ, రాసి ఇస్తాము, వీటిని మీరు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకోవచ్చు, ఇంకా మీ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవచ్చు, తద్వారా మహదానందాన్ని, ఉత్సాహాన్ని పొంది, మీరు మరిన్ని అద్భుతాలు చేయగలగడానికి, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే టాబ్లెట్స్ లాగా, మీ వంశ వృక్షం "ఈ-బుక్స్", పనిచేస్తాయని చెప్పడంలో, ఎలాంటి సందేహంలేదు. మీ వంశంలో కొత్తగా జన్మించిన వారి వివరాలు ప్రతీ సంవత్సరం మీ "ఈ-బుక్" అప్డేట్ చేసి ఇస్తాము, అప్డేషన్ చార్జెస్ మీరు అదనంగా ఇవ్వవలసిన ఉంటుంది, వివరాలకు దయచేసి సంప్రదించండి, సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ అందించే పర్సనల్ “ఈ-బుక్స్”, టెక్స్ట్ అండ్ ఆడియో విజువల్ మిక్స్డ్, వండర్ఫుల్ మల్టీమీడియా ప్రొడక్ట్స్ కోసం, సాఫ్ట్ సర్వీసెస్, ఏ టూ జడ్, ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ని సంప్రదించండి, వంశ వృక్షం మోడల్ వీడియోస్ కోసం, గూగుల్ క్రోమ్ లో లేదా యూట్యూబ్ లో, మా ఫోన్ నెంబర్ తో సెర్చ్ చేసి చూడండి, సాఫ్ట్ సర్వీసెస్, ఏటూజడ్, ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్, పర్సనల్ సర్వీసెస్, వంశవృక్షం, ఫోన్ నెంబర్: నైన్ టూ ఫోర్ సెవెన్, టూ ఫైవ్ వన్ త్రీ టూ సిక్స్,
ధన్యవాదములు.
దయచేసి సంప్రదించండి మీ
SOFT SERVICES A-Z
The secret of success
ని
మీ సాఫ్ట్ మెమరీస్ ని పదిలపర్చుకోవడం కోసం!!
ఫోన్ నెంబర్: 9247251326.
ఇంకా మీకు కావలసిన ఇతర పర్సనల్ బుక్స్ ఎన్నో
మీరు కోరిన విధంగా చేసిస్తాము!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి